ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్‌ను అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులు జరిపేందుకు రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. పాక్ ఉగ్ర సంస్థ జైషే కోసం ఈ దాడులు చేయాలనుకున్నట్లు చెప్పింది. ఉమర్, ముజమ్మిల్‌తో కలిసి రెండేళ్ల నుంచి అమ్మోనియా నైట్రేట్ సేకరిస్తున్నట్లు పేర్కొంది.