TG: పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు టూరిజం శాఖ అధికారులతో సమీక్షించారు. టూరిజం పాలసీ 2025-30ని తీసుకురావాలని నిర్ణయించారు. ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ పాలసీకి సంబంధించిన డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయగా, ఈ నెలాఖరులోగా దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.