Bharat: భారత్ పేరు ఎందుకు మార్చుతారు? ఇండియా పేరెవరు పెట్టారు?
భారతదేశంలో భాషతో సంబంధం లేకుండా దేశాన్ని భారత్(bharat)గా మార్చాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఇండియా పేరుని భారత్ అని ఎందుకు మార్చుతున్నారు. గతంలో మన దేశం పేరు ఎలా ఉండేది? ఏమని పిలిచే వారు అనేది ఇప్పుడు చుద్దాం.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశానికి అధికారికంగా “భారత్(bharat)” అని పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల G20 శిఖరాగ్ర సమావేశానికి ఇచ్చిన ఆహ్వానాల పత్రాల్లో “భారత్ ప్రెసిడెంట్” అని చేర్చారు. దీంతో ఇండియా పేరు భారత్ అని మార్చాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జీ20 సమావేశాలకు ముందే ఈ పదం ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆగస్టులో మోడీ సౌతాఫ్రికాకు బ్రిక్స్ సమావేశాల కోసం వెళ్లినప్పుడు కూడా ఇండియా పేరుకు బదులు భారత్ ఉపయోగించారు. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని అయా పత్రాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత గ్రీస్ పర్యటనలో కూడా అలాగే ప్రస్తావించారు. అయితే ఈ పేరు మార్పు గురించి ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎవరు స్పందించలేదు. కానీ ఇండియా పేరు మొదట్లో ఎలా ఉండేది? దాని చరిత్ర ఎంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అధికారికంగా ఏమని పిలుస్తారు?
దేశానికి అధికారిక పేరు భారత రాజ్యాంగంలో “భారతదేశం, అది భారత్”గా పేర్కొనబడింది. ఇది రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. భారత రాజ్యాంగం 1951లో వ్రాయబడింది. కానీ 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియా(india) అని పేరు ఉండటం చాలా చర్చనీయాంశమైంది. 18వ శతాబ్దం చివరి నుంచి మన దేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలించినప్పుడు ఆంగ్ల పేరును “ఇండియా”గా ప్రాధాన్యం పొందింది. చారిత్రక పటాలలో కూడా వారు ఈ పేరును ప్రముఖంగా ఉపయోగించారు. కానీ స్వాతంత్రం పొందిన తరువాత దేశంలోని కొత్త నాయకులు ఈ పదం వాడుకను తొలగించపోగా.. అధికారిక పత్రాలలో కూడా అదే చేర్చారు.
గతంలోనే ఈ అంశంపై చర్చ..
గత కొన్ని వారాలుగా పలువురు మంత్రులు తమ సోషల్ మీడియా(social media)లో ఇండియా పదాన్ని తొలగించి దాని స్థానంలో “భారత్” అని పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు అనేక మంది అధికారులు కూడా దేశాన్ని “భారత్” అని మాత్రమే పేర్కొనాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. మరోవైపు 2012లో సైతం కాంగ్రెస్ సభ్యుడు శాంతారం నాయక్ పార్లమెంటులో దేశం పేరు భారత్ అని మార్చాలని ఓ బిల్లు ప్రవేశపెట్టారు. మనం భారత్ మాతాకీ జై అంటాం కానీ, ఇండియాకి జై అనమని గుర్తు చేశారు. ఆ క్రమంలో 2014లో యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) కూడా ఎంపీగా ఉన్న క్రమంలో ఇదే అంశంపై బిల్లు ప్రవేశపెట్టారు. ఇలా అనేక మంది దేశం పేరు భారత్ గా మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అప్పుడు ఈ విషయాన్ని కేంద్రానికి తెలపాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పేరు మళ్లీ కనిపించడంతో ఇప్పుడు ఇండియా పేరు మాార్పుకు చూస్తున్నారని చర్చమొదలైంది.
పురాణాల్లో కూడా
దేశానికి సంస్కృత పేరు, పురాణ సాహిత్యాలలో ఒకటైన మహాభారతం(mahabharatam) నుంచి కూడా వచ్చింది. ఇందులో భారతీయులు భరత్ రాజు వారసులని నమ్ముతారు. చాలా మంది చరిత్రకారుల ప్రకారం ఇది ప్రారంభ హిందూ గ్రంథాల నాటిదని నమ్ముతారు. ఈ పదానికి హిందీలో “భారతదేశం” లేదా మహా భారత్ అని అర్థం వస్తుంది. అయితే ఈ పేరు మార్చితే .INని ఉపయోగించే వెబ్సైట్లకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.