»Who Will Benefit From The Womens Reservation Bill Who Loses
Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?
లోక్‌సభలో నేడు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభతో పాటుగా రాష్ట్ర అసెంబ్లీలోనూ మహిళలకు ఈ బిల్లు ద్వారా 33 శాతం రిజర్వేషన్ రానుంది. సోమవారమే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్‌మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అనే పేరు పెట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా లభించనుంది. అయితే రాజ్యసభ లేదా శాసనమండలికి మాత్రం ఈ బిల్లు వర్తించదు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడవ వంత సీట్లను రిజర్వ్ చేయనున్నారు. ఈ బిల్లు ప్రకారంగా ఒక సీటు కోసం ఇద్దరు మహిళా ఎంపీలు పోటీలో పాల్గొనకూడదు. ఇందులో ఓబీసీ క్యాటగిరీలో మహిళలకు రిజర్వేషన్ అనేది ఉండదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాతే ఈ రిజర్వేషన్లు కేటాయించనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వ్డ్ సీట్లకు రొటేషన్ పద్ధతిని కల్పించినట్లు తెలిపారు.
గత 27 ఏళ్ల నుంచి ఈ మహిళా బిల్లు పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు ఈ బిల్లుకు మోక్షం కలిగింది. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. చట్టంగా మారిన తర్వాత ఆ బిల్లు సుమారు 15 ఏళ్ల పాటు అమలులో ఉండాలి. ఆ టర్మ్‌ను కావాలంటే కొనసాగించే అవకాశం కూడా ఉంది.
ఈ బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలు మహిళా బిల్లును వ్యతిరేకించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 శాతం మాత్రమే మహిళలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో స్థానాలు ఉన్నారు. మహిళా బిల్లు అమలులోకి వస్తే 33 శాతం వారికి రిజర్వేషన్లు అందనున్నాయి.
స్కూల్ టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడటంతో విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారు. అయితే తమ రీల్స్ చూసి లైక్ చేయాలని టీచర్లు వేధింపులకు గురి చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కాస్తా రంగంలోకి దిగి పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.