ప్రధాని మోదీ(Pm Modi) తెలంగాణ(Telangana)కు రానున్నారు. ఆయన తెలంగాణలో పర్యటించనున్న షెడ్యూల్(Schedule) ఖరారైంది. జులై 8వ తేదీన రాష్ట్రంలో ఆయన పర్యటించనున్నారు. వరంగల్(warangal)లో మోదీ పర్యటన సాగనుంది. రైల్వే శాఖ(Railway department) ఆధ్వర్యంలో కాజీపేటలో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ సెంటర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
అదేవిధంగా వరంగల్(warangal)లోని మెగా టెక్స్టైల్స్ పార్క్‌కు కూడా మోదీ(Pm Modi) శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నారు.
తెలంగాణ(Telangana)లో కేంద్ర ప్రభుత్వం 200 ఎకరాల్లో రూ.10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేయబోతోంది. ప్రధాని మోదీ(Pm Modi) తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెల 8వ తేదీన హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం జరగాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని బీజేపీ(BJP) వాయిదా వేసింది.