పోలీసులు (Police) అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా సామాన్యులు, పేదవారి పట్ల కొంత మంది పోలీసులు వ్యవహరించే తీరు.. తలచుకుంటేనే భయమేస్తుంటుంది. అయితే అందరు పోలీసులు అలా ఉండరు అనేది మనం గుర్తుంచుకోవాలి. విద్యుత్ (electricity) లేకుండా ఏడు పదుల వయసులో జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి(old lady) పోలీసులు.. దగ్గరుండి కరెంట్ కనెక్షన్ ఇప్పించారు. దీంతో తన దశాబ్దాల కల నెరవేరినందుకు.. ఆ వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది బులంద్‌షహర్(Bulandshahr)కు చెందిన 70 ఏళ్ల నూర్జహాన్‌కు ఇంట్లో ఇప్పటి దాకా కరెంటు వెలుగులు లేవు.
విద్యుత్తు కలగానే మిగిలిపోయింది. నూర్జన్ విద్యుత్ కనెక్షన్ కోసం పోలీసులను సంప్రదించింది. ఆమె కోరిక విన్న ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ(Anukriti Sharma) ఆలస్యం చేయకుండా తమ పోలీసు నిధుల నుంచి అవసరమైన ఫ్యాన్, బల్బ్‌ను కొనుగోలు చేసి ఇంటికి కరెంటు వచ్చేలా చేశారు. తన ఇంట్లో విద్యుత్ బల్బు వెలగడంతో ఆ మహిళ ముఖం వెలిగిపోయింది. ఇక అక్కడికి వెళ్లిన పోలీసు అధికారులు ఫ్యాన్ ఆన్ చేసి స్విచ్‌లు ఎలా ఆపరేట్ చేయాలో నూర్జహాన్‌కు వివరించారు. నూర్జహాన్ ఎంతో కృతజ్ఞతతో ఐపీఎస్ ఆఫీసర్‌ను కౌగిలించుకుంది. పోలీసు అధికారులు నూర్జహాన్‌కు మిఠాయిలు పంచారు. మనసుని హత్తుకునే ఈ వీడియోను అనుకృతి శర్మ (Anukriti Sharma, IPS) తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.