»Rahul Gandhis Truck Ride To Listen To Drivers Mann Ki Baat
Rahul Gandhi అర్ధరాత్రి లారీలో రాహుల్ గాంధీ.. సెక్యూరిటీ లేకుండానే ప్రయాణం
సాధారణ వ్యక్తిలా లారీలో కూర్చుని దాదాపు 50 రిలో మీటర్ల మేర ప్రయాణం చేశారు. ఇది అసలైన మన్ కీ బాత్ అని చెబుతూ ఈ యాత్ర చేపట్టారు. అనంతరం అంబాలాలో లారీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఫలితాల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) జోరు మీదుగా ఉంది. కర్ణాటక ఫలితాలు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వానికి నిదర్శనంగా కాంగ్రెస్ భావిస్తోంది. భారత్ జోడో యాత్రతో (Bharat Jodo Yatra) రాహుల్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇక ప్రజల్లోకి కూడా చొచ్చుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న రాహుల్ మరో సంచలన ప్రయాణం చేశారు. అర్ధరాత్రి.. భద్రతా సిబ్బంది లేకుండా లారీలో ప్రయాణించాడు.
కర్ణాటక ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా ఆర్టీసీ బస్సు (RTC Bus) ఎక్కి ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్న రాహుల్ అదే మాదిరి లారీ డ్రైవర్ల (Lorry Drivers) స్థితిగతులు తెలుసుకునేందుకు ఓ ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సోమవారం రాత్రి హర్యానాలోని (Haryana) ముర్తాల్ (Murthal) నుంచి అంబాలా (Ambala) వరకు లారీలో ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా లారీలో కూర్చుని దాదాపు 50 రిలో మీటర్ల మేర ప్రయాణం (Journey) చేశారు. ఇది అసలైన మన్ కీ బాత్ అని చెబుతూ ఈ యాత్ర చేపట్టారు. అనంతరం అంబాలాలో లారీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఓ వీడియో విడుదల చేసి ఓ పోస్టు పెట్టింది.
‘ట్రక్కు డ్రైవర్ల (Truck Drivers) సమస్యలు తెలుసుకునేందుకు జన నాయకుడు రాహుల్ గాంధీ ముందుకు కదిలివచ్చారు. ఢిల్లీ నుంచి చండీఘర్ (Chandigarh) వరకు రాహుల్ ప్రయాణించాడు. మీడియా ప్రకారం భారత రోడ్లపై (Indian Roads) దాదాపు 90 లక్షల ట్రక్కు డ్రైవర్లు ఉన్నారు. వారి సమస్యలు వారికి ఉన్నాయి. మన్ కీ బాత్ రాహుల్ గాంధీ వారి ద్వారా ఆలకించారు. మీ మధ్యలో రాహుల్ గాంధీ.’ అని కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసింది.
ట్రక్కు ప్రయాణం ద్వారా డ్రైవర్ల స్థితిగతులు రాహుల్ తెలుసుకున్నారు. ముఖ్యంగా పెట్రోల్ (Pertrol), డీజిల్ (Diesel) ధరల పెంపుతోపాటు టోల్ గేట్ల ఛార్జీల పెంపుతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాహుల్ తో డ్రైవర్లు చెప్పారని సమాచారం. పార్కింగ్ ప్రదేశాలు, విశ్రాంతి కేంద్రాలు, పోలీసుల వేధింపులు వంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాహుల్ తో డ్రైవర్లు చెప్పారు. త్వరలోనే వాటికి పరిష్కారం లభిస్తుందని.. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని రాహుల్ భరోసా ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
जननायक @RahulGandhi जी ट्रक ड्राइवर्स की समस्या जानने उनके बीच पहुंचे।
राहुल जी ने उनके साथ दिल्ली से चंडीगढ़ तक का सफर किया।
मीडिया रिपोर्ट्स के मुताबिक, भारत की सड़कों पर करीब 90 लाख ट्रक ड्राइवर्स हैं। इनकी अपनी समस्याएं हैं। इनके 'मन की बात' सुनने का काम राहुल जी ने किया। pic.twitter.com/Bma2BCjGpY