Rahul Gandhi : సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ కు రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో(Surat Sessions Court) అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ (Lok Sabha) సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారని సమాచారం.
పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో(Surat Sessions Court) అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ (Lok Sabha) సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది.ఈ క్రమంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది.
కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ (Wayanad) నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు. రాహుల్ గాంధీ దోషిగా తేలిన ఈ కేసు 2019 నాటిది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ ఏడాది ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో(Kolar) పర్యటించిన రాహుల్.. ‘మోదీ’ అనే ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బిజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ప్రధాని మోదీ (Pm modi) కుటుంబాన్ని అవమానపర్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భావప్రకటనా స్వేచ్ఛతోనే ఆ వ్యాఖ్యలు చేశానని వాదించారు.ప్రస్తుతం రాహుల్ గాంధీ కేసుపై రాజకీయ వర్గాలతో పాటు న్యాయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఐపీసీ సెక్షన్ 499 (Section 499 of IPC) ప్రకారం రాహుల్ గాంధీ దోషిగా తేలారు. ఈ సెక్షన్ కింద రెండేళ్ల శిక్ష పడటం చాలా అరుదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం.. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని విపక్షాల నోరు మూయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అత్యంత నిర్లక్ష్యపూరితమైనవని మరికొందరు విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ (European Union) కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య లు చేయబోమని ఈయూ విదేశాంగ వ్యవహారాల ప్రధాన అధికార ప్రతినిధి పీటర్ స్టానో పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ పరిణామాలను పరిశీలిస్తున్నామని, రాహుల్ గాంధీ (Rahul Gandhi) అప్పీల్‌పై కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతామని తెలిపారు