»Pm Modi Sleep On The Floor Prime Minister In Anushthana Diksha
Pm Modi: నేలపై నిద్ర.. అనుష్ఠాన దీక్షలో ప్రధాని
అయోధ్య రామమందిర విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి 22న కానుంది. దీనికోసం ప్రధాని మోదీ 11 రోజుల అనుస్ఠాన దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షలో భాగంగా ఆయన నేలపైనే నిద్రిస్తున్నారు.
Pm Modi: దేశవ్యాప్తంగా అందరు ఎదురుచూసే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న జరగబోతుంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధాని మోదీ 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన మోదీ దీక్షను ప్రారంభించారు. దీక్షలో భాగంగా అప్పటి నుంచి మోదీ కఠిన నియమాలు, మతపరమైన వ్యాయామాన్ని పాటిస్తున్నారు. పూర్తిగా నేలపై నిద్రిస్తూ.. కొబ్బరి నీళ్లే సేవిస్తున్నారు. రామాలయ నిర్మాణాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు రామ మందిరానికి కానుకలను సమర్పిస్తున్నారు. ఇప్పటికే చాలా కానుకలు అయోధ్య చేరుకున్నాయి.