ప్రస్తుతం హీరోయిన్గా, సినిమాల పరంగా కాకుండా.. సోషల్ మీడియాలో సమంత ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనమే. అలాగే తన అభిమానులతో ఎప్పుడు కూడా టచ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్గా సామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Samantha: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత.. ఆ మధ్య సమంత పై ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ సమంతకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉందనే టాక్ కూడా నడిచింది. అంతేకాదు.. సమంత అమ్మతనానికి దూరంగా ఉండడానికి షాకింగ్ డెషిషన్ తీసుకుందని వినిపించింది. మొత్తంగా సామ్ రెండో పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గానే ఉంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు దూకుడు మీద ఉంది.
లేటెస్ట్గా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన వైవాహిక జీవితం గురించి ఇండైరెక్ట్‌గా కామెంట్స్ చేసింది. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదేనంటూ చెప్పుకొచ్చింది. తన ఇష్టాలను గుర్తించడంలేదనే విషయాన్ని తాను చాలా లేట్‌గా తెలుసుకున్నానని, ఎందుకంటే తన భాగస్వామి గతంలో వాటిని ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చింది. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల నుంచే పాఠం నేర్చుకుంటామనే విషయం అప్పుడే అర్థమైందని.. ఎప్పుడైతే తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానో అప్పటినుంచే తన ఎదుగదల మొదలైందని చెప్పింది.
అంటే.. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సామ్ తనకు నచ్చినట్టుగా ఉండలేకపోయిందా? అందుకు చై అడ్డు పడ్డాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇకపోతే.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత వెకేషన్లు, సోషల్ మీడియాతోనే టైంపాస్ చేస్తోంది. కానీ నిర్మాతగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.