Tamilnadu Minister Udhayanidhi Stalin Calls BJP Is A Snake
Udhayanidhi Stalin : జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. రాముడి పవిత్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకపై దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ వేడుకకు అయోధ్యలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. కానీ మరోవైపు, ప్రాణ ప్రతిష్టకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇటీవల కాలంలో ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద ప్రకటనలతో తరచూ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తున్నారు. మరోసారి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉదయనిధి మాట్లాడుతూ.. మేము లేదా మా పార్టీ నాయకులు ఏ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కాకపోతే మసీదు కూల్చివేసిన స్థలంలో ఆలయాన్ని నిర్మించడాన్ని మేము సమర్థించలేమన్నారు. మా నాయకుడు చెప్పినట్లు మతాన్ని, రాజకీయాలను కలపవద్దు. మేము ఇంకా దాని స్టాండ్ పైనే ఉన్నామన్నారు.
ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, యువజన వ్యవహారాల మంత్రి. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 2 న ఒక కార్యక్రమంలో అతను డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి అంటువ్యాధులతో సనాతన ధర్మాన్ని ముడిపెట్టాడు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వివాదాస్పద ప్రకటనపై బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వాటిపై పోరాడాల్సిన అవసరం లేదని, వాటిని నిర్మూలించాల్సిందేనని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ ప్రకటనకు కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 13న కోర్టుకు హాజరుకావాలని కోరింది.