»Ketika Sharma Young Heroine In Sai Dharam Tej Love
Ketika Sharma: సాయి ధరమ్ తేజ్ ప్రేమలో యంగ్ హీరోయిన్?
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో.. ఈ బ్యూటీ చాలా హాట్ గురూ అనె చెప్పాలి. అమ్మడి అందానికి ఈపాటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఉండాలి. కానీ ఆఫర్లు అరకొరగానే వస్తున్నాయి. అయితే.. సాయి ధరమ్ తేజ్ పై మాత్రం అమ్మడు మనసు పారేసుకున్నట్టుగానే ఉంది వ్యవహారం.
Ketika Sharma: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రంతో కుర్రకారును ఫిదా చేసింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాలో నటించింది. అయినా కూడా అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది కేతిక. ఎద అందాలు, థైస్ షో చేస్తూనే ఉంది. ఈ బ్యూటీ భారీ అందాలకు.. కుర్రకారుకు కునుకు రావడం కష్టమే.
అలాంటి ఈ హాట్ ఫిగర్ సాయి ధరమ్ తేజ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కు జంటగా నటించింది కేతిక శర్మ. దీంతో లేటెస్ట్గా సాయి ధరమ్ తేజ్ పై కేతిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఓ తెలుగు షోలో హాజరైన కేతికకు.. మెగా బ్రదర్స్ సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరిలో ఎవరు హస్బెండ్ మెటీరియల్ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కేతిక బదులిస్తూ.. సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇద్దరు బ్రదర్స్ చాలా స్వీట్.. వారిద్దరికీ నేను చాలా క్లోజ్.
వైష్ణవ్, తాను చిన్నపిల్లలా కొట్టుకుంటుంటాము. కానీ తేజ్‌తో చాలా డీప్ విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటాను.. అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. సాయి ధరమ్ తేజ్‌ను సపరేట్గా హస్బెండ్ మెటీరియల్ అని కేతిక చెప్పడంతో.. అమ్మడు మనసు పారేసుకున్నట్టుంది.. అతనితో ప్రేమలో ఉంది.. అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.