PM Modi : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో మెట్ల బావి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధకరమైన దుర్ఘటన. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడాను.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో మెట్ల బావి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధకరమైన దుర్ఘటన. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడాను. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించాను’’ అంటూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.
ప్రమాద ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో శ్రీరామనవమి సందర్భంగా పటేల్ నగర్ లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనం భారీగా తరలివచ్చారు. అయితే.. ఓవైపు ఉత్సవాలు జరుగుతుండగా ఇంకోవైపు మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు.
ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో ఐదుగురు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన తర్వాత కొంతమందిని స్థానికులే ఎలాగోలా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.