OPS meets Dinakaran.. key movement in AIADMK party
AIADMK:తమిళనాడు రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం (OPS).. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ అధినేత టీటీవీ దినకరన్‌ను (dinakaran) కలిశారు. జయలలిత (jayalalita) చనిపోయాక శశికళ (sasikala) సీఎం పదవీ చేపట్టే ప్రయత్నం చేయగా.. పన్నీర్ సెల్వం (Panneerselvam) అడ్డుపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరు దూరంగా ఉంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీని పళనిస్వామి (palani swamy) హస్తగతం చేసుకున్నారు. పార్టీ నుంచి పన్నీర్ సెల్వంను (Panneerselvam) బహిష్కరించారు. దీంతో ఓపీఎస్ ధర్మయుద్దం 2.ఓ పేరుతో పోరాటానికి దిగారు. పళనిస్వామి (palani swamy), అతని మద్దతుదారుల నుంచి పార్టీని తిరిగి స్వాధీనం చేసుకోవడమే ఎజెండా అని చెబుతున్నారు. ఆ క్రమంలో ఈ రోజు దినకరన్‌తో (dinakaran) సమావేశం అయ్యారు.
దినకరన్.. దివంగత జయలలిత (jayalalita) నెచ్చెలి శశికళ (sasikala) మేనల్లుడు దినకరన్ అనే సంగతి తెలిసిందే. త్వరలో శశికళను (sasikala) కూడా కలుస్తానని పన్నీర్ సెల్వం తెలిపారు. స్వార్థపరుల కబంధ హస్తాల నుంచి పార్టీని తిరిగి స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యం అని అంటున్నారు.
ఓపీఎస్, దినకరన్ సీపీఐ, సీపీఎం మాదిరిగా కలిసి పనిచేస్తాని మరో నేత పన్రుతి రామచంద్రన్ తెలిపారు. అన్నాడీఎంకే పూర్వపు స్థితికి వచ్చేందుకు అందరూ కలిసి పనిచేయాలని శశికళ (sasikala) ఇదివరకు చెప్పారని గుర్తుచేశారు. శశికళ (sasikala), దినకరన్, పన్నీర్ సెల్వం తమిళనాడులో బలమైన తెవార్ సామాజిక వర్గానికి చెందిన వారు.
పార్టీ నుంచి బహిష్కరణ గురించి పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన కోర్టు సెల్వం వాదనలను తోసిపుచ్చింది. దీంతో పళనిస్వామి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవీ చేపట్టారు. అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు పళని అండ్ కో చేతిలో ఉంది. పార్టీని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పన్నీర్ సెల్వం రంగంలోకి దిగారు. ఈ రోజు దినకరన్.. రేపు శశికళతో సమావేశం అవుతారని తెలిసిందే.