Stalin Government: తమిళనాడులో సీబీఐకి స్టాలిన్ ప్రభుత్వం (Stalin Government) నో ఏంట్రీ అంటోంది. సీబీఐ జనరల్ కన్సెంట్ను విత్ డ్రా చేసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా సరే సీబీఐ తమిళనాడు ప్రభుత్వం (tamilnadu government) అనుమతి అడగాలి.. పర్మిషన్ ఇస్తేనే కేసు టేకాఫ్ అవుతుంది.
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (balaji) మనీలాండరింగ్ కేసులో ఈడీ (ed) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలో స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం ఉన్నాయి. ఆ జాబితాలో పదో రాష్ట్రంగా తమిళనాడు చేరింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీబీఐ (cbi), ఈడీ (ed), ఐటీలను (it) వాడుకొని.. ప్రత్యర్థులపై దాడులు చేస్తోంది. ఇదే విషయంపై అన్నీ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. అందుకే తమ రాష్ట్రంలోకి రానీయకుండా సీబీఐపై ఆంక్షలు విధిస్తున్నాయి.