అన్నాడీఎం(AIADMK)కే మర్రిచెట్టులాంటిదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్మి ఎడప్పాడి పళనిస్వామి(Palaniswami) తెలిపారు. ఎవరికీ బానిస కాదని ఆయన అన్నారు. తమిళనాడు సేలం జిల్లా (Salem District) ఆత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో ఇదే బీజేపీ(BJP)తో డీఎంకే పొత్తు పెట్టుకుంది. ఎన్డీఏ(NDA )ప్రభుత్వంలో డీఎంకే నేతలను మంత్రులుగా చేయలేదా? ఊసరవెల్లిలాగా పరిస్థితులను బట్టి రంగులు మార్చుకుంటారని ఆయన ఆరోపించారు. అధికారం కోసం, కుటుంబ సభ్యులకు పదవులు దక్కడం కోసం డీఎంకే ఏమైనా చేస్తుందని పళనిస్వామి అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) రాష్ట్రంలో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధిస్తుందని అమిత్షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను విలేకర్లు ప్రస్తావించగా… అన్నాడీఎంకే- బీజేపీ కూటమి పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు.కూటమి వేరు, పార్టీ సిద్ధాంతం వేరన్నారు.
సెంథిల్ బాలాజీ(Senthil Balaji)పై మొట్టమొదట అవినీతి ఆరోపణలు చేసిందే స్టాలిన్ (Stalin) అని తెలిపారు. అయితే ప్రస్తుతం రాజకీయ నాగరికతను మరిచి సెంథిల్ బాలాజీని మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని తెలిపారు.ఆయన్ను కాపాడేందుకు డీఎంకే(DMK) యత్నిస్తుందన్నారు. నటుడు విజయ్ (Actor Vijay) వ్యాఖ్యలపై స్పందిస్తూ… ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా రాజకీయాలు మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. ఆదివారం ఆత్తూరు, నరసింగపురం ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 300 మందికి పైగా పార్టీలో చేరారు. వారికి పళనిస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆసుపత్రిలో తమిళనాడు (Tamil Nadu) మంత్రిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు (ED) కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ జూన్ 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.