ఆయన సీనియర్ డాక్టర్. అయినా సరే రూ.20 కే వైద్యం చేస్తాడు. ఆయన డాక్టర్ అయినప్పుడు కేవలం రూ.2 కే వైద్యం చేసేవారు. ఫీజును ఈ మధ్య రూ.20 చేశారు. ఆయన పేరు డాక్టర్ మునిశ్వర్ చందర్ దావర్. వయసు 77. రోజూ దాదాపు 200 మంది పేషెంట్లను చూస్తారు. వాళ్ల నుంచి కేవలం రూ.20 మాత్రమే వసూలు చేస్తారు. 1967 లో మునిశ్వర్ జబల్ పూర్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
1971 లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఆయన ఒక సంవత్సరం పాటు భారత ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత 1972 నుంచి జబల్ పూర్ లో ప్రజల కోసం హెల్త్ కేర్ సెంటర్ పెట్టి అతి తక్కువ ఫీజు తీసుకొని వైద్యం చేస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఆయన ప్రజల కోసం చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.