»Horrific Accident In Up Truck Hits Car In Jaunpur 6 People Killed
Uttarpradesh : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఆదివారం ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
bus and tractor collision in ap anantapur district four people died
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఆదివారం ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గౌరా బాద్షా పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రసాద్ కాలేజీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. కారు యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. మృతులంతా బీహార్లోని సీతామర్హి జిల్లా వాసులు, వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నారు. మృతులను అనీష్ శర్మ, గజధర్ శర్మ, జవహర్ శర్మ, గౌతమ్ శర్మ, సోనమ్, రింకుగా గుర్తించారు. గాయపడిన వారి పేర్లు జితు శర్మ, మీనా దేవి, యుగ్ శర్మ. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.