బీహార్ (Bihar) ప్రభుత్వం సంచలన నిర్ణయ తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించి ఆఫీస్‌కి రాకూడదని సర్కారు నిషేధం విధించింది. ప్రస్తుత ట్రెండ్ వర్క్‌ప్లేస్‌ల సంస్కృతికి విరుద్ధంగా ఉందని ఆ శాఖ తెలిపింది. ఉద్యోగులు(employees) టీషర్టులు, జీన్స్ ధరించి కార్యాలయాలకు రావడంపై విద్యాశాఖ (Education dpt) డైరెక్టర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ,‘ఆఫీస్ సంస్కృతికి విరుద్ధమైన ఇలాంటి దుస్తులు ధరించి ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్నట్లు గమనించాం. అధికారులు లేదా ఇతర ఉద్యోగులు సాధారణ దుస్తులు ధరించి కార్యాలయానికి రావడం కార్యాలయంలోని పని సంస్కృతికి విరుద్ధంని పేర్కొంది.
ఉద్యోగులు అధికారిక దుస్తులు ధరించాలని, గుర్తింపు కార్డులను తీసుకురావాలని కోరారు. 2019లో బీహార్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో జీన్స్, టీ షర్టులు (T-shirts) ధరించడాన్ని నిషేధించింది. ఈ ఆర్డర్ ఉద్దేశ్యం కార్యాలయ గౌరవాన్ని కాపాడుకోవడమే అని తెలిపింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు సాధారణ, సౌకర్యవంతమైన, లేత రంగు దుస్తులు ధరించాలని ప్రభుత్వం కోరింది.ముఖ్యంగా, సరన్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ (Magistrate) ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో జీన్స్ మరియు టీ-షర్టులు ధరించకుండా నిషేధించారు.