గౌతమ్ అదానీ ఇష్యూపై లోక్ సభ అట్టుడికింది. అదానీకి ప్రయోజనం కల్పించేందుకు నిబంధనలను మోడీ సర్కార్ మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాపార రంగంలో రూల్స్ ఛేంజ్ ఎందుకు చేశారని అడిగారు. కేవలం అదానీ గ్రూపునకు మేలు చేయడానికేనని స్పష్టంచేశారు. ఎయిర్ పోర్టుల గురించి అనుభవం లేకుంటే వాటిని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ ఈ రూల్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చిందని తెలిపారు.
అదానీకి ఆరు విమానాశ్రయాల బాధ్యతను అప్పగించిందని పేర్కొన్నారు. తర్వాత దేశంలో ఎక్కువ ఆదాయం గల ముంబై ఎయిర్ పోర్ట్‌ను జీవీకే నుంచి అదానీ గ్రూపునకు కట్టబెట్టిందని తెలిపారు. ఇందుకోసం తమ దత్త సంస్థలు సీబీఐ, ఈడీని వాడి.. జీవీకే యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేశారని తెలిపారు.
అదానీ ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు అని రాహుల్ గాంధీ తెలిపారు. 2014లో అదానీ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 609 స్థానంలో ఉన్నారని.. ఏం మ్యాజిక్ జరిగిందో తెలియదు కానీ.. రెండో స్థానానికి చేరాడని పేర్కొన్నారు. గతనెల 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అదానీ కంపెనీల్లో అవకతవకల గురించి పార్లమెంట్‌ను కుదిపేసింది.