»Coast Of Anant Ambani Radhika Merchant Pre Wedding Celebrations
anant ambani : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఖర్చు చూస్తే షాకే
అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జామ్ నగర్లో పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకలకు అయిన ఖర్చు చూసి అంతా షాకైపోతున్నారు.
anant ambani pre wedding celebrations : భారత సంపన్నుడు ముకేశ్ అంబానీ చిన్న పుత్రుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్నగర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రాధికా మర్చెంట్ను అనంత్ వచ్చే జులై 12న వివాహం చేసుకోనున్నారు. అయితే ఇప్పుడు జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అయిన ఖర్చు సంగతి ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు జామ్నగర్లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు. రాజకీయ, క్రీడా, సినీ రంగాల్లోని వారు పాలు పంచుకున్నారు. వీరందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి, వసతులు, సౌకర్యాల కోసం అంబానీ కుటుంబం భారీగానే ఖర్చు చేసింది. అంబానీ కుటుంబంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో దీన్ని ఇంత ఘనంగా జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల(anant ambani-radhika merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం వారు ఏకంగా రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన వేడుకల్లో ఇది ఒకటని అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. వచ్చిన అతిధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వీరు ఈ వేడకల్ని చాలా జాగ్రత్తగా నిర్వహించారని అంటున్నారు. బిల్ గేట్స్, జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్.. లాంటి వారికి బస ఏర్పాట్లు చేయడానికే వీరు రూ.52 కోట్ల వరకు ఖర్చు చేశార్ట. ఢిల్లీ, ముంబైల నుంచి వీరిని తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశార్ట.