TG: జనగామ BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ పేరుతో ఫోన్ చేసిన దుండగులు.. ‘వికసిత్ భారత్’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం ఇప్పిస్తామని నమ్మించారు. 40 మంది పేర్లు పంపాలని కోరి, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.2,500 వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన MLA జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.