Central Cabinetలో మార్పులు.. 22 మందిపై వేటు పడే ఛాన్స్..?
కేంద్రమంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగనుంది. 22 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి బండి సంజయ్ లేదంటే లక్ష్మణ్.. ఏపీ నుంచి జీవీఎల్ లేదంటే సీఎం రమేష్, లేదంటే కిరణ్ కుమార్‌కు పదవీ వరించనుంది.
Cabinet Expansion: మరో 4, 5 నెలల్లో వివిధ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు.. ఆయా చోట్ల నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి నేతలను తీసుకోవాలని కమలదళం అనుకుంటోంది. మరో 10 నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నందున మంచి టీమ్‌తో కలిసి ముందుకెళ్లాలని మోడీ, షా టీమ్ భావిస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ లోపే మంత్రివర్గంలో మార్పు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన మోడీ ఫ్రాన్స్ వెళుతున్నారు. ఆ లోపే మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) జరిగే అవకాశం ఉంది. మార్పులు, చేర్పులకు సంబంధించి మోడీ, షా, నడ్డా చర్చించారని తెలిసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (nadda), ప్రధాన కార్యదర్శి సంతోష్‌తో (santosh) కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, అర్జున్ రామ్ మెగ్వాల్, భూపేంద్ర యాదవ్, గజేంద్రసింగ్ షెకావత్, ఎస్పీఎస్ బగేల్, ప్రహ్లాద్ జోషి భేటీ అయ్యారు. వీరిలో ప్రహ్లాద్ జోసి, భూపేంద్ర యాదవ్‌కు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. పనితీరు సరిగాలేని 22 మందిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం లభిస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు రెండు కేంద్ర మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి బండి సంజయ్ (bandi sanjay) పేరు వినిపిస్తోంది. మంత్రి పదవీ చేపట్టేందుకు బండి సుముఖంగా లేరట. ఆయన నిరాకరిస్తే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌కు (laxman) అవకాశం లభించనుంది. ఏపీలో జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao), లేదంటే సీఎం రమేష్ (cm ramesh) రేసులో ఉన్నారు. వీరిద్దరూ కాదంటే.. ఇటీవల బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ (kiran kumar) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.