చంద్రబాబు హయాంలో మహిళల మిస్సింగ్ గురించి ఏ రోజైనా మాట్లాడారా అని నాని నిలదీశారు. 2015 నుంచి 2022 వరకు ఎన్సీఆర్బీ రిపోర్ట్‌ను ప్రస్తావించారు. 2015 నుంచి 18 వరకు 3 వేలకు పైగా 18 ఏళ్లకు పైబడిన యువతులు అదృశ్యం అయ్యారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 16 వేలకు పైగా మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయని తెలిపారు. పవన్ చెబుతోన్న 30 వేల మంది యువతుల లెక్క చూపించాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు వణుకు వస్తోందని పేర్ని నాని (Perni Nani) అన్నారు. పవన్ తీరు చూస్తే అత్తారింటికి దారేది సినిమాలో స్వామి జీ గెటప్ మాదిరిగా ఉందని పేర్ని నాని (Perni Nani) విమర్శించారు. కొల్లేరు గురించి పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసు అని అడిగారు. మీడియా బాస్ రాస్తాడు.. చంద్రబాబు వాట్సాప్ చేస్తాడు.. లారీ ఎక్కి పవన్ చదువుతాడని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయని తెలిపారు.
చిరంజీవికి పవన్ కల్యాణ్‌కు చాలా తేడా ఉందని పేర్ని నాని (Perni Nani) అన్నారు. చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేయాలంటే పవన్ కరెక్ట్ అని చిరంజీవి అన్నారని.. దీనికి మంచి అర్థం ఉందన్నారు. బాబుతో జట్టుకట్టి.. అబద్దాలు చెప్పడం, విషం చిమ్మడం తన వల్ల కాదని చిరంజీవి తప్పుకున్నారని పేర్కొన్నారు.