»Bjp Candidates First List May Be Announced In Bjp Cec Meet 41 Possible Names Pm Modi
Lok Sabha Election 2024 : నేడే లోక్ సభ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం (ఫిబ్రవరి 29) సాయంత్రం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ అనంతరం సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Lok Sabha Election 2024 : 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం (ఫిబ్రవరి 29) సాయంత్రం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ అనంతరం సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్లతో సహా 41మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సాయంత్రం 7 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ నేత బీఎల్ సంతోష్, ఇతర సభ్యులు ఇందులో పాల్గొంటారు.
ఈ సమావేశంలో కోర్ గ్రూప్ రాష్ట్రాల ముఖ్య సభ్యులు కూడా పాల్గొంటారు. ఇందులో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, జార్ఖండ్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, ఒడిశా, ఢిల్లీ, మణిపూర్, జమ్మూ కాశ్మీర్.. సాధ్యమైన పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచుతారు.
బీజేపీ తొలి జాబితాలో 120 మంది అభ్యర్థుల పేర్లు
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలిజాబితాలో 100 నుంచి 120 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలతో సహా దాదాపు 40 మంది నేతల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.