»Azam Khans Game Is Over Will Pay For His Sins Jaya Prada
Jaya Prada: అజంఖాన్ కథ ముగిసింది, పాపాలకు శిక్ష తప్పదు
సమాజవాది పార్టీ నేత అజమ్ ఖాన్ పైన జయప్రద నిప్పులు చెరిగారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్నారు. తండ్రి కొడుకులు చేసిన పనికి తగిన మూల్యం మరింత చెల్లించక తప్పదు అన్నారు.
సమాజవాది పార్టీ నేత అజమ్ ఖాన్ పైన జయప్రద నిప్పులు చెరిగారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్నారు. తండ్రి కొడుకులు చేసిన పనికి తగిన మూల్యం మరింత చెల్లించక తప్పదు అన్నారు. మీరట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇప్పటికే అజమ్ ఖాన్ పని అయిపోయింది అన్నారు. పలు కేసుల్లో శిక్ష ఖరారు కావడంతో అజమ్ ఖాన్, ఆయన తనయుడు ఇటీవల తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేశారు. దీనిని పరోక్షంగా ప్రస్తావిస్తూ జయప్రద విమర్శలు గుప్పించారు.
రాజకీయాల్లో భిన్న పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ అధికార గర్వం ఉండవద్దు అని సూచించారు. మహిళలను గౌరవించాలి.. పేదలకు సాయం చేయాలి అన్నారు. కానీ అజమ్ ఖాన్, ఆయన తనయుడికి మాత్రం ఆ గుణం లేదు అన్నారు. అజమ్ ఖాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాడు అని, మరింత మూల్యం తప్పదు అన్నారు.