Arvind kejriwal
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయి తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్ రెండు రోజుల కిందట కలిశారు. అయితే ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంజయ్ సింగ్ ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’ అని ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని వినిపించారు. దేశం కోసం, రాష్ట అభివృద్ధి కోసం ప్రజలకు ఓ కొడుకులా, సోదరుడిలా పనిచేసిన కేజ్రీవాల్‌ను జైలుకు పంపారని ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
ఇది కూడా చూడండి: Delhi Crime: ఢిల్లీలో దారుణం.. పోలీసులపై కాల్పులకు దిగిన వ్యక్తి
కేజ్రీవాల్‌ను కలవడానికి జైలుకి వెళ్తే గ్లాస్ గోడకు ఇరువైపులా ఉండి ఇంటర్‌కామ్ ద్వారా మాట్లాడుకునేలా చేశారన్నారు. దీని బట్టి చూస్తే ఢిల్లీ సీఎంపై ప్రధానికి ఎంత ద్వేషముందే అర్థమవుతోందని ఆయన తెలిపారు. కేజ్రీవాల్‌ను మానసికంగా కుంగదీసేందుకు, నిరుత్సాహపరిచేందుకు తిహార్ జైల్లో 24 గంటలు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నేత ఆరోపించారు. అతనిని ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంత బలంగా తిరిగి వస్తాడన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం బీజేపీకు, ప్రధాని మోదీకి సిగ్గుచేటని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చూడండి: Vijay Deverakonda: మళ్లీ మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ!

