పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభ రెండు గంటల వరుకు వాయిదా పడ్డాయి. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ పై హిండెన్ బర్గ్ రిసెర్చ్ ఇచ్చిన నివేదిక పై చర్చ జరపాలని విపక్షాలు చేయడంలో ఉభయ సభలను వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభలోనూ బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే ఇవాళ లోక్సభ సమావేశం అయిన తర్వాత .. విపక్షాలు వెల్లోకి దూసుకువెళ్లి ఆ అంశంపై చర్చను చేపట్టాలని కోరాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. సభ్యులు సభా మర్యాదలను పాటించాలని చైర్మెన్ ధన్కర్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం రెండు గంటలకు వరకు వాయిదావేశారు.