»Lok Sabha Speaker Om Birla Says I Want To Thank Everyone For Showing Trust In Me
Om Birl : నాపై విశ్వాసం ఉంచినందుకు అందరికీ థ్యాంక్స్ : స్పీకర్ ఓం బిర్లా
వరుసగా రెండో సారి లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. తనపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయనను ప్రశంసించారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Lok Sabha Speaker Om Birl : తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లోక్ సభ స్పీకర్(Lok Sabha Speaker) ఓం బిర్లా చెప్పారు. రెండోసారి తనకు స్పీకర్గా అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను మళ్లీ స్పీకర్ పదవికి పోటీ చేయడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులకు సైతం ఆయన థ్యాంక్స్ చెప్పారు.
స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగిన స్పీకర్ ఎన్నికలో ఆయన గెలుపొందారు. తొలుత ఎన్డీయే తరఫున ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. దీన్ని పలువురు మంత్రులు బలపరిచారు. అనంతరం ఇండియా కూటమి తరఫున ఎంపీ కె సురేశ్(శివసేన యుబిటి) పేరును సభలో ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ను ఎన్నుకునేందుకు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటు ద్వారా ఓం బిర్లా చివరికి స్పీకర్గా ఎన్నికయ్యారు.
స్పీకర్గా ఓం బిర్లా(Om Birla) తిరిగి ఎన్నికవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిర్లా చిరు నవ్వుతో సభ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. స్పీకర్ పదవి ఎంత కఠినమైనదో తనకు తెలుసునన్నారు. సభా మర్యాదల్ని కాపాడేందుకు కొన్ని సార్లు కఠిన నిర్ణయాలూ తీసుకోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. మరో పక్క ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. సభ సజావుగా నడిచేందుకు ప్రతిపక్షం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు.