తేజాసజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతానికి ఓ ఆసక్తికరమైనదే. ఎందుకంటే హనుమాన్ లాంటి కంట్రీవైడ్ బ్లాక్బస్టర్ తర్వాత వస్తున్న తేజ సినిమా ఇది. అందులో హనుమంతులవారు ప్రధానమైన పాత్ర. ఆయనవల్లే హనుమాన్ హిట్ అయిందన్నవారు కూడా లేకపోలేదు.
ఇటీవలి రోజుల్లో చూస్కోండి కావాలంటే రాముడో కృష్ణుడో లేకుండా భారీ ఎత్తు సినిమాలన్నవే లేవు. దానికి కారణం లేకపోలేదు. ఎప్పుడైతే కార్తికేయ 2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో మన తెలుగు దర్శకుల దృష్టి మన పురాణపాత్రల మీద పడింది. అయితే ఏ సినిమాలు రాకముందే కల్కి అనే కథా ప్రక్రియ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆశ్వద్ధామ పాత్ర ఎప్పుడైతే కథకి కేంద్రబిందువైందో కృష్ణుడి పాత్ర తప్పనిసరి. ఎందుకంటే అశ్వద్ధామకి కృష్ణుడు పెట్టిన శాపం వజ్రాయుధఘాతంలా పనిచేసింది. అదే అశ్వద్ధామని చిరంజీవిని చేసింది. అదంతా మహాభారతగాధలో అత్యంత కీలకమైన ఘట్టం. కాబట్టి కృష్ణుడు అన్న పాత్ర లేకుండా భారతపురాణ గమనమే లేదు. అందుకే కల్కి సినిమాలో కృష్ణ పాత్ర. కానీ దర్శకుడు నాగ అశ్విన్ గడుసుగా ఏ గొప్పనటుడిని కృష్ణుడి పాత్రకు ఎంపిక చేసుకోలేదు. ఎందుకంటే ఏ పాప్యులర్ యాక్టర్ కృష్ణపాత్రని పోషించినా కూడా సినిమా మొత్తం అటువూపు తూగిపోయేది. ఆ ప్రమాదం నుంచి కథని తప్పించాడు నాగ అశ్విన్.
అలాగే ఇప్పుడు మిరాయ్ టీజర్ నిన్నమొన్న విడుదలైంది. తేజాసజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతానికి ఓ ఆసక్తికరమైనదే. ఎందుకంటే హనుమాన్ లాంటి కంట్రీవైడ్ బ్లాక్బస్టర్ తర్వాత వస్తున్న తేజ సినిమా ఇది. అందులో హనుమంతులవారు ప్రధానమైన పాత్ర. ఆయనవల్లే హనుమాన్ హిట్ అయిందన్నవారు కూడా లేకపోలేదు. అది నిజం కూడా. గతంలో కూడా ముత్యాలముగ్గు, శ్రీ ఆంజనేయం…ఇలా చెప్పుకుంటే బోలెడు సినిమాలు చేరుతాయి జాబితాలో. మరి మిరాయ్లో ఏముంది? తేజ సజ్జా కూడా సినిమాని మొత్తం లాక్కెళ్ళేంత దమ్మున్న హీరోకాదు. బడ్డింగ్ హీరో. కాబట్టి ఏం కలుపుతారా అన్న చర్చ మొదటనుంచీ ఉంది.
దానికి ఇటీవల విడుదలైన మిరాయ్ టీజర్ సమాధానం చెప్పింది. టీజర్లో పాదాలను మాత్రమే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఓ పజిల్ పెట్టాడు. ఆ పాదాలు ఎవరివి అని? అయితే ఓ స్ట్రాంగ్ క్లూ ఇచ్చాడు. అది మిస్ అయ్యారు. చాలా మంది అదెవరు అనే రాతలు రాస్తున్నారు. అంటే బొత్తిగా నాలెడ్జ్ లేకపోవడం అనమాట. ఆ పురాణపాత్ర పాదాలు, పిక్కల నుంచి నీలిరంగులో ఉండడాన్ని గమనించాలి. నీలిరంగులో ఉండే పురాణపాత్రలు రెండే రెండు. ఒకటి కృష్ణుడు. రెండు రాముడు. అయితే ఇది కృష్ణుడు కావడానికి అస్సలు ఆస్కారమే లేదు. ఎందుకంటే వానరమూక రాముడికి తప్ప మరెవ్వరికీ చేతులెత్తి, తలదించి నమస్కరించవు. అన్ని వేల కోతుల సమూహం ఆ ఎత్తైన విగ్రహం కదులుతుంటే భక్తిపారవశ్యంలో దండాలు పెడుతున్నాయి. అది రాముడే. కాగా ఈ పాత్రని రానా దగ్గుబాటా, రిషభ్ శెట్టా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో ప్రారంభమైంది. ఇద్దరూ కాదు. ఈ పాత్రని ఎవ్వరో ఊరూపేరూ లేని వ్యక్తి చేత చేయించాడు దర్శకుడు కార్తీక్. కల్కి సినిమాలో లాగా అవుట్ ఫోకస్లో మాత్రం రాముడి పాత్ర కనిపిస్తుంది స్క్రీన్ మీద. అంతవరకే రాముడి పాత్రని వాడుతున్నారు సినిమాలో. అయితే దీని ఇంపాక్ట్ ఎంత వరకూ ఉంది టోటల్ రన్లో అన్నది చూస్తేగానీ చెప్పలేం.