మెగాహీరో వరుణ్‌తేజ్(Varun Tej)-లావణ్యత్రిపాఠి రీసెంట్ గా కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్(Engagement) చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి పై రకరకాల గాసిప్ (Gossip)లు వినిపిస్తున్నాయి..సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది… వరుణ్ తేజ్ కు పెళ్లికి ముందే ఒక కండిషన్ పెట్టిందట లావణ్యత్రిపాఠి(Lavanyatripathi).. ఆ కండిషన్ కు వరుణ్ తేజ్ ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి లావణ్య ఒప్పుకుందట. లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం.
పెళ్లైన తర్వాత కూడా తనకు స్టేజ్ పైన భరతనాట్యం (Bharatanatyam)చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదనే కండిషన్ ఆమె పెట్టిందట. పెళ్లి తర్వాత నటనకైతే దూరంగా ఉంటాను కానీ… ప్రొడక్షన్ (Production)వైపు మాత్రం వెళ్తానని చెప్పిందట. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి వరుణ్ తేజ్ తో పాటు, మెగా ఫ్యామిలీ (Mega Family) ఒప్పుకుందని చెపుతున్నారు. మరోవైపు వీరి పెళ్లి డిసెంబర్ (December)లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే వీరి జాతకం ప్రకారం ఇటలీ(Italy)లో పెళ్లి జరిగితే సంసారం సాఫీగా సాగుందని పండితులు చెప్పినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. మరి నాగబాబు (Naga Babu)పెళ్లి ఎక్కడ చేస్తాడో చూడాలి.. ఇక వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..వరుణ్ తేజ్ కట్నం వద్దని చెప్పినా కూడా లావణ్య తల్లిదండ్రులు తమ కూతురి కోసం భారీ స్థాయిలో కట్నం ఇవ్వటానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.