Mudra Yojana scheme: కింద రూ.20 లక్షల లోన్ క్లారిటి
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త స్కామ్స్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పేకు వన్ రూపీ పంపించి తిరిగి పంపించాలని పలువురిని బురిడీ కొట్టించి లుటీ చేశారు. తాజాగా ముద్ర స్కీం(Mudra Yojana scheme) పేరుతో మీరు రూ.20 లక్షల లోన్(rs 20 lakh loan) పొందేందుకు అర్హులని కొంత మంది పోన్లకు మెసేజులు పంపిస్తున్నారు. ఆ క్రమంలో సదరు వ్యక్తులు స్పందించగా వారి నుంచి పలు వివరాలు తీసుకుని వారి ఖాతానుంచి నగదు దోచేస్తున్నారు. దీనిపై అనేక మంది ఫిర్యాదు కూడా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ అంశం కాస్తా PIBకి తెలియడంతో ఫాక్ట్ చెక్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించింది. తెలియని వారి నుంచి వస్తున్న సమాచారానికి స్పందించకూడదని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ ప్రకటనలు చూసి మోసపోవద్దని అధికారులు సైతం సూచించారు.
అయితే PM ముద్రా యోజన స్కీం అనేది 2015 సంవత్సరంలో ప్రారంభించబడిన ప్రభుత్వ పథకం. ఈ పథకంలో కార్పొరేట్, వ్యవసాయేతర పనులకు రుణాలు ఇవ్వబడతాయి. దీనికి డిపాజిట్ సెక్యూరిటీ కూడా అవసరం లేదు. MUDRA, అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ & రిఫైనాన్స్ ఏజెన్సీ. ఇది మైక్రో యూనిట్ల ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి కోసం రీఫైనాన్సింగ్ కల్పించే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థ. MUDRA ఉద్దేశ్యం బ్యాంకులు, NBFCలు, MFIల వంటి వివిధ ఇన్స్టిట్యూషన్ల ద్వారా నాన్ కార్పొరేట్ రంగానికి చెందిన చిన్న వ్యాపారులకు రుణాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
ఈ పథకం కింద ప్రభుత్వం మూడు కేటగిరీల్లో మాత్రమే రుణాలు ఇస్తుంది. వాటిలో
1. శిశు: రూ.50,000/- వరకు రుణాలను అందజేస్తారు
2. కిషోర్: రూ.50,000/ నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను ఇస్తారు
3. తరుణ్: రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందజేస్తారు