PDPL: ఓదెల మండల కేంద్రంలోని తారకరామా కాలనీ పరిధిలో గల 32వ రైల్వే గేటు వద్ద లైన్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు గేటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలన్నారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు.