CTR: పుంగనూరులో ఆదివారం నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ విజయవంతంగా ముగిసింది. అశేష జనవాహినితో సభాస్థలి కిక్కిరిసింది. కాషాయ రంగు జెండాలను చేత పట్టుకుని పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. సభా స్థలంలో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు, చెక్క భజనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. హిందూ మత పెద్దలు హాజరయ్యారు. హిందుత్వం యొక్క గొప్పతనం గురించి వివరించారు.