TG: ఆరోగ్య శ్రీ పథకంపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశంసించాను. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాను. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది. కేసీఆర్ కిట్ లాంటి పథకాలను కూడా నిలిపివేసింది. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారు’ అని అన్నారు.