దసరా బరిలో మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలయ్య, రవితేజ, విజయ్ సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా మేమే దసరా విన్నర్ అని అంటున్నాయి. మరి జనాలు ఏం చెబుతున్నారు?
Dussehra:దసరాకు కానుకగా మూడు పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. అక్టోబర్ 19న భగవంత్ కేసరి, లియో రిలీజ్ అవగా.. నెక్స్ట్ డే టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ అయింది. ఈ మూడు సినిమాలు కూడా వేటికవే దసరా విన్నర్‌గా ప్రకటించుకున్నాయి. కానీ అసలు విన్నర్ ఎవరనేది ఆడియెన్స్ తేల్చనున్నారు. అయితే లియో, టైగర్ నాగేశ్వర రావు పాన్ ఇండియా టార్గెట్‌గా రిలీజ్ అయ్యాయి. భగవంత్ కేసరి మాత్రం రీజనల్ లెవల్లోనే రిలీజ్ అయింది. అయినా కూడా రెండు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్లో చేరిపోయింది భగవంత్ కేసరి. ఖచ్చితంగా ఈ సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉందంటున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చిన ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ ఉన్నారు. కానీ లియో సినిమా మాత్రం డివైడ్ టాక్ నుంచి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అయినా కూడా డే వన్ 140 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని అంటున్నారు లియో మేకర్స్. ఒక్క తెలుగులోనే రెండు రోజుల్లో 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు.
బాలయ్య, రవితేజ సినిమాలు పోటీలో ఉన్నా కూడా.. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లంటే మామూలు విషయం కాదు. కానీ లియో పనైపోయిందనేది జనాల మాట. ఇక మాస్ మహారాజా టైగర్ నాగేశ్వర రావుకు కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ బాగుందని అంటున్నప్పటికీ.. సెకండాఫ్‌లో కాస్త మాస్ డోస్ ఎక్కువైందనే టాక్ నడుస్తోంది. అయినా కూడా.. డే వన్ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా మూడు సినిమాలు దసరా విన్నర్ అంటున్నప్పటికీ.. బాలయ్య సినిమాదే పై చేయిగా కనిపిస్తోంది. అయితే.. ఫైనల్ విన్నర్ ఎవరో తేలాలంటే.. దసరా వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.