దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కింది లియో సినిమా. దాంతో అంతకు మించి అంచనాలతో థియేటర్లోకి వచ్చింది లియో. ఈ సినిమా టాక్ మాత్రం డివైడ్‌గా ఉంది. అందుకే రెండో రోజు భారీ డ్రాప్ కనిపించింది.
Leo: పాన్ ఇండియా సినిమాల్లో లియో మార్క్ ఓ రేంజ్లో ఉంటుందని అనుకున్నారు. కానీ.. ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ బాగుందని అంటున్నా.. సెకాండాఫ్ అస్సలు బాగాలేదని అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ అదిరిందని అంటున్నప్పటికీ.. ఆడియెన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇది లోకేష్ రేంజ్ సినిమా కాదు.. అని కామెంట్స్ మార్నింగ్ షో నుంచే టాక్ స్టార్ట్ అయింది. అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 148 కోట్లకి పైగా రాబట్టింది లియో. ఈ సినిమా దెబ్బకు ఆదిపురుష్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. సెకండ్ డే మాత్రం లియోలో కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. డే వన్ 148 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు మాత్రం 50 కోట్లకు అటు ఇటుగా రాబట్టినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే.. భారీ వసూళ్లను రాబట్టి ఉండేది. కానీ డివైడ్ టాక్ వల్ల.. ఒక్క రోజుకే వంద కోట్ల డ్రాప్ కనిపించింది.
లియో ఇక కష్టమే అంటున్నారు. శనివారమే పరిస్థితి ఇలా ఉంటే.. మండే వరకు లియో సినిమా కలెక్షన్స్ సింగిల్ డిజిట్‌కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాస్టర్ సినిమాతో విజయ్‌కి ఫ్లాప్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్.. లియో మూవీతో సాలిడ్ హిట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇది కూడా నిరాశ పరిచిందని లోకేష్ ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఫైనల్‌గా లియో ఎంత రాబడుతుందో చూడాలి.