బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపాడు. వివేక్ తన తదుపరి చిత్రం వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Vivek Agnihotri: భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల గురించి అందరికీ తెలిసిందే. వీటిపై పలు భాషల్లో వందల చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కథ ఒకటే.. కానీ తెరకెక్కించిన విధానం వేరే. ఇందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ప్రభాష్ నటించిన ఆదిపురుష్ సినిమా రామాయణ ఆధారంగానే తెరకెక్కింది. ఈ చిత్ర యూనిట్ మీద ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కనీస పరిజ్ఞానం, పరిశోధన లేకుండా రామాయణం తీయడం కరెక్ట్ కాదు. ఎవరిని పడితే వాళ్లను ప్రజలు రాముడిగా ఒప్పుకోరని అన్నాడు.
BIG ANNOUNCEMENT:
Is Mahabharat HISTORY or MYTHOLOGY?
We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’: PARVA – AN EPIC TALE OF DHARMA.
There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’.
మహాభారతానికి సంబంధించి సినిమా తీస్తా అని ప్రకటించాడు. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. మహాభారతం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పర్వ అనే పేరును ఇంతకు ముందే ఖరారు చేశాడు. దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశాడు. ఈ చిత్రం మూడు భాగాలుగా ఉంటుందని తెలిపాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా వివాదాలకు దారితీయడంతో పాటు రాజకీయ ఆరోపణలకు కూడా కారణమైన విషయం తెలిసిందే.