Pushpa 2 :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప' బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా 'పుష్ప' సాంగ్స్ బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్.. సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
పుష్ప పార్ట్ వన్‌లో పుష్పరాజ్ ఎదుగుదలను చూపించిన సుకుమార్.. పుష్ప సెకండ్ పార్ట్‌లో పవర్ ఫుల్ రూలింగ్ చూపించబోతున్నాడు. పుష్ప2 అప్డేట్ కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు సుకుమార్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్పరాజ్ హంగామా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా Hunt before The RULE పేరుతో అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇరవై సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్‌లో పుష్పరాజ్ రూలింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందనేలా చూపించారు. 2004లో తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకోవడంతో.. దేశం మొత్తం అట్టుడికిపోయినట్టు చూపించారు. అసలు పుష్ప ఎక్కడ.. అంటూ క్యూరియాసిటీని పెంచేశారు. ఇదంతా మీడియా వాయిస్ ద్వారానే వినిపించారు. జస్ట్ ఈ కొన్నిసెకండ్ల గ్లింప్స్ ఎన్నో ప్రశ్నలు రేకెత్తించేలా ఉంది. మరి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడో తెలియాలంటే.. ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడే Hunt before The RULE ఫుల్ గ్లింప్స్ రానుంది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత.. పుష్పరాజ్ పాన్ ఇండియా వేటకు బయల్దేరాడు.. అంటూ సోషల్ మీడియలో ట్రెండ్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక ఏప్రిల్ 5న అంటే ఈ రోజు హీరోయిన్ రష్మిక మందన బర్త్ డే కావడంతో.. శ్రీవల్లికి సాలిడ్ పోస్టర్‌తో విష్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. దీంతో రష్మిక లుక్, పుష్పరాజ్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి బన్నీ బర్త్ డేకి పుష్ప2 ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.