Allu Arjun : యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న పుష్పరాజ్!
Bunny : పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం..
పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం.. కానీ నెక్స్ట్ బర్త్ డే ఇలా ఉండదు.. బన్నీ పాన్ ఇండియా లెక్కలన్నీ మారుతాయని.. అంటున్నారు అల్లు అభిమానులు. అందుకు తగ్గట్టే పుష్ప2 వీడియో యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తెలుగుతో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో పుష్ప వీడియో దుమ్ముదులిపేస్తోంది. ఈ వీడియోకి యూట్యూబ్‌లో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి.. 75 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా, 2.96 మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. దీంతో మేకర్స్ సోషల్ మీడియాలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పుష్ప2కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ని మల్కన్‌గిరి ఫారెస్ట్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప2ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.