Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వెయ్యి కోట్ల బిజినెస్ ప్రపోజల్ ఉందనే టాక్ నడుస్తోంది. దాన్ని రీచ్ అవడమే కాదు.. ఇంకా అంచనాలు పెంచేసేలా ప్లాన్ చేస్తున్నాడు సుక్కు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వెయ్యి కోట్ల బిజినెస్ ప్రపోజల్ ఉందనే టాక్ నడుస్తోంది. దాన్ని రీచ్ అవడమే కాదు.. ఇంకా అంచనాలు పెంచేసేలా ప్లాన్ చేస్తున్నాడు సుక్కు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఏకంగా మూడు నిమిషాల టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ అప్టేడ్స్ ఇవ్వబోతున్నారట. బన్నీ పుట్టిన రోజుకి ఒకరోజు ముందే పుష్ప2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారట. ఇక బన్నీకి బర్త్ డే విష్ చేస్తూ టీజర్ రిలీజ్ చేయనున్నారట. అలాగే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక బన్నీ బర్త్ డేకి థియేటర్లో పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు అల్లు ఫ్యాన్స్. ఈ మధ్య స్టార్ హీరోల ఫ్యాన్స్ రీ రిలీజ్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ‘ఆరెంజ్’ మూవీని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు బన్నీ బర్త్ డేకి ‘దేశముదురు’ రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ గురించి నిర్మాత డీవీవీ దానయ్యతో చర్చలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో యూత్‌ను తెగ అట్రాక్ట్ చేసింది. పూరి మార్క్ మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టాడు అల్లు అర్జున్. దాంతో మరోసారి ‘దేశ ముదురు’ థియేటర్లో దుమ్ముదులపనుంది. మొత్తంగా.. ఈసారి బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో జరగబోతున్నాయి.