Pushpa 2 : అంతుపట్టని పుష్ప2.. గోరునే ఎందుకు హైలెట్ చేశారు!?
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.
ఏకంగా మూడు నిమిషాల వీడియోతో పుష్ప 2 పై ఊహించని హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సాలిడ్ గిఫ్ట్ ఇచ్చి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం వేర్ ఈజ్ పుష్ప వీడియో యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన ఐదు భాషల్లో దుమ్ముదులిపేస్తోంది. ఇక గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బన్నీ లుక్ ట్విట్టర్లో ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజ్ అయ్యాక, బన్నీ అమ్మోరు జాతరకు థియేటర్లు ఉంటాయా.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా పుష్ప2 పై ఊహించని హైప్ క్రియేట్ చేశారు బన్నీ, సుకుమార్. అలాగే ఎన్నో డౌట్స్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బన్నీని ఎలివేట్ చేసిన టైగర్ షాట్‌తో పిచ్చెక్కించాడు సుక్కు. కానీ ఇక్కడే అంతు పట్టని డౌట్ రైజ్ చూశాడు. పుష్పరాజ్ బ్రతికే ఉన్నాడని నైట్ విజన్ కెమెరాలో చూపించారు. ఇక్కడ పుష్పరాజ్ తగ్గేదేలే.. అనే మ్యానరిజమ్ చూపిస్తాడు. ఈ సందర్భంగా.. పుష్ప చిటికిన వేలు గోరు పెద్దగా ఉండి.. రెడ్ కలర్లో హైలెట్ అయ్యేలా చూపించారు. నైట్ విజన్ విజువల్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే.. ఆ ఒక్క గోరుని మాత్రమే రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపించారు. దీంతో గోరు ఎందుకు పెంచాడు.. రెడ్ కలర్‌ను ఎందుకు హైలెట్ చేశారనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. అమ్మవారి వేషధారణ కోసమే.. ఆ గోరుని హైలెట్ చేశారని అంచనా వేస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలో అదో ఆచారం అనే టాక్ కూడా నడుస్తోంది. అలాగే పుష్ప హిజ్రాగా కూడా నటిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చిటికెన వేలి గోరుతో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాడు సుకుమార్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.