Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.
ఇప్పటికే పుష్ప2 డిజిటల్ రైట్స్ కోసమే.. మేకర్స్ 200 కోట్లు కోట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. వన్స్ పుష్ప2 అప్డేట్ బయటికొస్తే.. ఈ డీల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే ఫస్ట్ వీడియో భారీగా ప్లాన్ చేస్తున్నాడు మాన లెక్కల మాస్టారు. ఒకే ఒక్క వీడియోతో.. సంచలనానికి ల్యాండ్ మార్క్ అవాలని అనుకుంటున్నాడు. అలా జరిగితేనే పుష్పరాజ్ వెయ్యి కోట్ల టార్గెట్ రీచ్ అవడం ఈజీ అవుతుంది. అది టీజర్ అయినా కావొచ్చు.. లేదంటే స్పెషల్ గ్లింప్స్ కావొచ్చు.. కానీ రాబోయే అప్డేట్ మాత్రం ఖచ్చితంగా అంతకుమించి అనేలా ఉండాల్సిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. పుష్ప2 నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు కన్ఫామ్ అయింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బర్త్ డే స్పెషల్‌గా దేశముదురు సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. దానికి తోడు పుష్ప2 ఫస్ట్ వీడియో.. థియేటర్లో మోత మోగించేందుకు రెడీ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. రాక్ స్టార్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.