»What Is The Role Of The Hit Director T Sailesh Kolanu In Ram Charans Game Changer
Ram Charan: గేమ్ ఛేంజర్ లో హిట్ డైరెక్టర్ కి ఏం పని..?
రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమాపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. RRR సంచలనం తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో హిట్ డైరెక్టర్(Sailesh Kolanu) కనిపించడం పట్ల పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్(Ram Charan) తన భార్య ఉపాసన ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విరామం తీసుకున్నారు. ఆ విరామం తర్వాత గేమ్ ఛేంజర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నాడు. ఈలోగా గేమ్ ఛేంజర్‌లోని కొన్ని సన్నివేశాలను శంకర్ చిత్రీకరించలేదని షాకింగ్ పుకార్లు వ్యాపించాయి. బదులుగా HIT ఫేమ్ శైలేష్ కొలను(Sailesh Kolanu) కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించినట్లు సమాచారం. రాకెట్ రాఘవ, రఘుబాబులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించినట్లు టాక్. రెండవ యూనిట్ సన్నివేశాలు, లాంగ్ షాట్ సన్నివేశాలను శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
రామ్ చరణ్ హైదరాబాదు(hyderabad)లో ప్రారంభమయ్యే యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఈయనే చిత్రీకరించనున్నారట. దీనిని శంకర్ పర్యవేక్షించగా అన్బరీవ్ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 45 రోజుల పాటు షెడ్యూల్ జరగనుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.