Varun Tej-Lavanya: నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలు అందరూ సందడి చేశారు. దాదాపు ఐదేళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకున్న వీళ్లు జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మొదటిసారిగా ఈ జంట సినిమా షుటింగ్ కోసం ఇటలీ వెళ్లి అక్కడ కలుసుకున్నారు. మొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నారో అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న ఇటలీలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం కాగా అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓ టాపిక్ వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంటుందని మెగా అభిమానులు గూగుల్‌లో వెతికుతున్నారు.
వరుణ్-లావణ్యకు మధ్య ఏజ్ గ్యాప్ కేవలం 11 నెలలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 1990 జనవరి 19న వరుణ్ తేజ్ జన్మించగా.. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న పుట్టింది. దీనిని బట్టి చూసుకుంటే వీరిద్దరి మధ్య 11 నెలలు మాత్రమే ఏజ్ గ్యాప్ ఉంది. అంటే లావణ్య కంటే వరుణ్ 11నెలలు మాత్రమే పెద్ద. 2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదటిగా వీళ్లు కలుసుకున్నారు. తర్వాత స్నేహితులుగా ఉన్న వీళ్లు ప్రేమికులుగా మారారు. ఐదేళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకున్న వీళ్లు ఏ కెమెరా కంట పడలేదు. తాజాగా ఇటలీలో వివాహం చేసుకున్న వీళ్ల రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది.