యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కాంట్రవర్శీలు కొత్తేం కాదు. అయితే అవి తన సినిమా ప్రమోషన్స్ కోసం క్రియేట్ చేసుకున్నవి.. కానీ అర్జున్‌తో వివాదం మాత్రం సీరియస్‌గా మారిపోయింది. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తీరా షూటింగ్ అన్నాక.. విశ్వక్ హ్యాండ్ ఇచ్చాడని.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అతని గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసేలా చేశాడు అర్జున్. దీని పై విశ్వక్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. అతని పై ఇండస్ట్రీలో నెగెటివిటీ మొదలైపోయింది.
అంతకు ముందు ఏం చేశాడని పక్కకు పెట్టి.. ఇప్పుడు విశ్వక్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడనే టాక్ మొదలైపోయింది. విశ్వక్ తీరుపై విమర్శలు చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. అర్జున్ అవుట్ డేటెడ్ అనుకుంటే.. అసలు విశ్వక్ ఈ ప్రాజెక్ట్ సైన్ చేయకుండా ఉండాల్సింది. ఈ మధ్య చాలామంది హీరోలు దర్శకుల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని.. అలా చేయడం వల్ల.. నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అంతేకాదు ఈ వివాదం మా అధ్యక్షుడు మంచు విష్ణుకు దగ్గరికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. విషయం మొత్తం తెలుసుకున్న విష్ణు.. విశ్వక్ పై కాస్త సీరియస్ అయ్యాడని సమాచారం. ఇలా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు విశ్వక్ తీరుపై అసహనంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలా అయితే ఈ వివాదం విశ్వక్ సేన్.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఖచ్చితంగా పడనుందని అంటున్నారు. దర్శకుడు ఎవరైనా సరే.. ఒక్కసారి కమిట్ అయ్యాక అతన్ని నమ్మి తీరాల్సిందేనని కొందరు అంటున్నారు.
లేదంటే కమిట్మెంట్కు ముందే సైడ్ అయిపోవాలని అంటున్నారు. కానీ షూటింగ్ పెట్టుకున్న తర్వాత తప్పుకోవడం ఏంటని అంటున్నారు. అయినా ఒక దర్శకుడిగా, హీరోగా విశ్వక్‌కు ఇదంతా తెలియదా.. అని ఇంకొందరు అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు టాలీవుడ్ వేళ్లన్ని విశ్వక్ వైపే చూపిస్తున్నాయి. అతనిదే తప్పంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి విశ్వక్ ఈ నెగెటివిటీ నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.