‘లైగర్’ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ డీలా పడిపోయాడా అంటే.. ఛాన్సే లేదంటున్నారు రౌడీ అభిమానులు. లైగర్ రిలీజ్ అయిన మరుసటి రోజే జిమ్‌లో కసరత్తులు మొదలెట్టిన రౌడీ.. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. రీసెంట్గా సైమా అవార్డ్స్‌లో రచ్చ చేసిన రౌడీ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివేట్ అయిపోయాడు. అయితే విజయ్ ఎక్కడా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా లైగర్ ఎఫెక్ట్ మాత్రం అతని గట్టిగానే పై ఉందనే చెప్పాలి. అందుకే వీలైనంత త్వరగా ‘ఖుషి’ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు.
శివ నిర్వాణ డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఖుషి.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ రెండో వారంలో ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ మూవీని అనుకున్న సమయానికి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు విజయ్. గతంలోనే ‘ఖుషి’ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అందుకే ఈ ప్రాజెక్ట్ డిలే అవకుండా నాన్ స్టాప్‌గా షూటింగ్ చేసి.. కరెక్ట్ టైంకు రంగంలోకి దిగి.. ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడట విజయ్. ఇక ఆ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి మోహన కృష్ణ లేదా హరీష్ శంకర్ డైరెక్షన్లో విజయ్ సినిమా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఖుషి మూవీతోనైనా రౌడీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.