సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ సినిమాతో.. ప్రస్తుతం థియేటర్ల వద్ద మాస్ ఆడియెన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో సుధీర్‌కు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో.. ఈ సినిమా ప్రూవ్ చేసిందని అంటున్నారు. దాంతో ఇప్పుడు టాలీవుడ్ బడా బడా నిర్మాణ సంస్థలు సుధీర్‌తో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
ప్రస్తుతం సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. ఇప్పుడైతే గాలోడు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను.. ఆ తర్వాత కొత్త కథలు వింటానని చెబుతున్నాడు సుధీర్. కాబట్టి గాలోడు మరో పవర్ ఫుల్ స్క్రిప్టుతో రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇకపోతే నవంబర్ 18న రిలీజ్ గాలోడు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. 6 కోట్లకు పైగా గ్రాస్.. 3 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.
దాంతో ఇప్పటికే మేకర్స్ లాభాల బాట పట్టారని అంటున్నారు. ఇదే ఇప్పుడు మంచు విష్ణుపై ట్రోల్ అయ్యేలా చేస్తోంది. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న విష్ణు.. ఇటీవల ‘జిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పైగా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు నటించిన సినిమా ఇదే. దాంతో భారీ ఆశలే పెట్టుకున్నాడు విష్ణు. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ముందే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు కొందరు. దీనిపై విష్ణు కూడా ఫైర్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
కానీ కలెక్షన్ల పరంగా జిన్నా తేలిపోయాడు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగానే జిన్నా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల మాట. అయితే ఇప్పుడు సుధీర్ సినిమా బ్రేక్ ఈవెన్ వసూళ్లను కూడా జిన్నా రాబట్టలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు ట్రోల్స్ రాయుళ్లు. గాలోడు బ్రేక్ ఈవెన్ విలువ ‘జిన్నా’ గ్రాస్ కంటే రెండు రెట్లు ఎక్కువ అని అంటున్నారు. మొత్తంగా మరోసారి విష్ణు ట్రోల్స్‌కు గురయ్యాడని చెప్పొచ్చు.