చాలామంది హీరోయిన్లు ఫేడవుట్ అయిపోయిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ త్రిష విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ఇక హీరోయిన్గా ఆమె పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు.
ప్రస్తుతం త్రిష(Trisha)ని చూస్తే అందమే తింటోందా.. అసలు రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుందే కానీ.. ఏ మాత్రం తగ్గడం లేదు అనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే.. కెరీర్ స్టార్టింగ్‌లో కంటే ఇప్పుడే అందానికే అసూయ పుట్టేలా ఉంది త్రిష. నాలుగు పదుల వయసుకు చేరవుతున్న ఈ ముద్దుగుమ్మకు.. అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఏం తింటుందో ఏమో గానీ.. పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తోంది త్రిష ముందు ఏ కుర్ర హీరోయిన్ కూడా పనికి రాదనే రేంజ్లో ఉంది. ఈ మధ్య మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్(Ponniyan selvan) సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఐశ్వర్య రాయ్(Iswaryarai)ని సైతం డామినేట్ చేసేలా కనిపించింది త్రిష(Trisha). అందుకే అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం త్రిష కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘లియో’ సినిమా(Leo Movie)లో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఇంకొన్ని తమిళ్, మళయాళ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే.. త్రిష టాలీవుడ్‌కి దూరమై ఆరేడేళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ‘స్టాలిన్’ మూవీలో చిరంజీవి(megastar chiranjeevi)తో కలిసి నటించింది త్రిష.
ఇక ఇప్పుడు అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో చిరుతో రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ(Director Kalyan krishna) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలోనే త్రిష(Trisha) హీరోయిన్గా ఫైనల్ అయినట్టు సమాచారం. ఇదే నిజమైతే.. దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష మెగాస్టార్‌తో జోడి కట్టబోతోందని చెప్పొచ్చు. చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మించబోతున్న ఈ సినిమా అఫిషీయల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది.