ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారగా, ఈ సినిమా రష్మిక మందన్నను నేషనల్ క్రష్‌గా మార్చింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండో భాగం శరవేగంగా జరుగుతోంది.
హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పుష్ఫ2 మూవీ(Pushpa2 Movie) షూట్లో జాయిన్ అయినట్లు సమాచారం. పుష్ప: ది రూల్ సెట్స్ నుండి స్నీక్ పీక్‌ను పంచుకోవడం ద్వారా రష్మిక దానిని వెల్లడించింది. ఈ సినిమాలో నైట్ షూట్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. నిర్మాతలు అల్లు అర్జున్ (Allu arjun), ఫహద్ ఫాసిల్లపై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్(First Glimpse)కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి వంగా(Director sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన షాహిద్ కపూర్ యానిమల్ చిత్రం(Animal Movie)లో రష్మిక(Rashmika) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ మూవీలో తన పాత్ర కోసం షూటింగ్(Shooting) పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు(Music Director Devisri Prasad). ఈ మూవీతో అయినా రష్మిక బాలీవుడ్ లో క్లిక్ అవుతుందో లేదో చూడాలి.